కడప

జగన్ విమర్శలు తిప్పికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 9:వైకాపా నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి జిల్లాలో తెలుగుదేశం కేడర్ విఫలవౌతోందని జగన్ ఆరోపణలను నేతలంతా మూకుమ్మడిగా ఎదుర్కోవాలని, ఆదిపత్యపోరు, వర్గపోరుకు స్వస్తిచెప్పి పార్టీని బలోపేతం చేయాలని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు తెలుగుతమ్ముళ్లకు క్లాస్ తీసుకున్నారు. జిల్లాలో ఆయన రెండురోజుల పాటు మకాం వేసి బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో నియోజకవర్గాల వారీగా నేతలతో వ్యక్తిగతంగా పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరిలో జిల్లాలో లోకేష్ పర్యటన సందర్భంగా నేతలతో సమీక్షించిన వ్యవహారాలపై నియోజకవర్గాల వారీగా నేతలతో ప్రస్తావిస్తూ గ్రూపుల రాజకీయాలకు, ఆదిపత్యపోరుకు స్వస్తి చెప్పాలని లేనిపక్షంలో పార్టీలో పనిచేసే వారికే స్థానం ఉంటుందని ఆయన మరోమారు నేతలతో నొక్కిచెప్పినట్లు తెలుస్తోంది. పదవులతోపాటు నేతలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారే తప్ప జగన్ ఈమద్య ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై నాయకులు పెద్దగా స్పందించలేదని విచారణ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలను తెలుగుదేశం నాయకులు కలుపుకుని పోవాలని , బేధాభిప్రాయాలకు స్వస్తి పలకాలని ఆయన సూచించారు. పార్టీ ఇన్‌చార్జిలు కూడా స్వపక్షంలో ఉన్న నేతలకు ప్రాముఖ్యత కల్పించాలని ఇన్‌చార్జి పదవి అనేది హోదాకాదని అందర్నీ సమన్వయం చేసుకోవాలని ఆయన నేతలను కోరారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఏదైన ఆపద వస్తే తనదృష్టికి తీసుకురావాలని వారికి పార్టీ సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని, ఏదైనా జబ్బుచేస్తే వారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి నిధి నుంచి చికిత్సలు చేయిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ బలోపేతం అయితే అధికారంలోకి వస్తామని ఆధిపత్యపోరులో గ్రూపులుగా ఉంటే పార్టీకి నష్టంతోపాటు నేతలు కూడా నష్టంవాటిల్లుతుందని గుర్తు చేశారు. ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములు, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డితో ఏకాంతంగా చర్చలు జరిపారు. లోకేష్‌ను కలిసిన వారిలో జిల్లా అద్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.