కడప

మహాసంకల్పం పేర కోట్లు దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 9:ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి రెండుసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడపలో బుధవారం మహాసంకల్పం సభ ఏర్పాటుతోపాటు ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం, ముఖ్యమంత్రి బాబు రెండేళ్లపాలనలో ప్రజాసంక్షేమం కోసం పాటుపడింది శూన్యమని జిల్లాకు చెందిన వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కె.శ్రీనివాసులు, మేయర్ కె.సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్ గూడురు రవి తదితరులు విలేఖర్ల సమావేశంలో బాబు పాలనపై ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం నగరంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలకు కూరుకుపోయి ప్రజలను మభ్యపెడుతూ ఈ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నవనిర్మాణం, సంకల్పం కార్యక్రమాల ద్వారా ప్రజలు మభ్యపెడుతున్నారని వారు ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన కోట్లరూపాయలతోపాటు ప్రజాధనం సుమారు రూ.20కోట్లు వెచ్చించి జిల్లాలో నవనిర్మాణ దీక్ష పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు పలు దఫాలు పర్యటించినా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకపోగా ప్రభుత్వ అధికారులతోపాటు డ్వాక్రామహిళలను, ఉపాధిహామీ కూలీలను నవనిర్మాణ దీక్ష సభకు బలవంతంగా తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో అమలుకాని హామీలు ఇచ్చి రైతులను, డ్వాక్రా మహిళలతోపాటు నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని రెండుసంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఒక్కరికీ కూడా ఉద్యోగ అవకాశం కానీ, నిరుద్యోగ భృతికాని చెల్లించిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫి చేస్తామని ప్రకటించి సక్రమంగా రుణమాఫీ చేయక రైతులను మరింత అప్పుల్లోకి నెట్టిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. నవనిర్మాణ దీక్ష సభకు సుమారు 5వేల మంది పోలీసు సిబ్బందితో పాటు 10 మంది ఐపిఎస్ అధికారులను వినియోగించి, కడపలో పోలీసుకవాతు నిర్వహించడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే అన్నారు. మాటలతో మభ్యపెడుతున్న చంద్రబాబుకు జిల్లాకు ఎలాంటి న్యాయం చేయకపోగా ప్రజాధనం నవనిర్మాణదీక్ష పేరిట కోట్లరూపాయలు దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీక్ష పేరిట చేపట్టిన ఖర్చుకు రైతులకు సంబంధించి కాలువలు, డ్యామ్‌లు నిర్మించవచ్చునన్నారు. రాయలసీమ ప్రజలు కరవుతో అల్లాడుతుంటే నవనిర్మాణ దీక్షకు భారీ ఎత్తున జనాలతోపాటు అధికారులను వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాయలసీమ పరిధిలో ఆర్టీసి బస్సులకే రెండుకోట్లరూపాయలు చెల్లించడం చంద్రబాబు అవినీతికి నిదర్శనమన్నారు. ఆచరణకు అమలుకాని వాగ్దానాలు చేయడంతోపాటు కడప జిల్లాకు ఉక్క్ఫ్యుక్టరీ సాధిస్తానని చెప్పి రెండుసంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికూడా ఇంకా సాధిస్తానని చెప్పడం జిల్లా ప్రజలను మోసగించడమే అన్నారు. అంతేగాక రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీలతోపాటు నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం ఒక్కటి కూడా అమలుపరచకపోవడం చంద్రబాబు మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషమన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటిసిలు, జిల్లా వైకాపా నాయకులు పాల్గొన్నారు.