అనంతపురం

విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, జూన్ 9 : మండల పరిధిలోని దేమకేతేపల్లికి చెందిన ఆదిలక్ష్మమ్మ, గోపాల్ కుమారుడు గొల్ల బాలు (13) గురువారం ఆత్మహత్య చేసుకునాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఉన్నత పాఠశాలలో బాలు తొమ్మిదో తరగతి చదువుతుండగా కనీసం సెలవు రోజుల్లో అయినా ఇంట్లో పనులు చేయాలని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలు పక్కనే ఉన్న మల్బరీ షెడ్డులోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై జమాల్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బావిలో మహిళ శవం లభ్యం
మడకశిర, జూన్ 9 : మండల పరిధిలోని హెచ్‌ఆర్ పాళ్యంలో ఉన్న ఓ బావిలో లలితమ్మ (30) మహిళ శవం లభ్యమైంది. గురువారం మధ్యాహ్నం పశువుల కాపర్లు అటు వైపు నుంచి వస్తుండగా బావిలో శవం కనిపించడంతో గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా మృతురాలు హెచ్‌ఆర్‌పాళ్యంకు చెందిన లలితమ్మగా గుర్తించారు. లలితమ్మ ప్రమాదవశాత్తు బావిలో మృతి చెందిందా, ఎవరైనా హత్య చేసి బావిలో పడవేశారా అన్న విషయాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధుని శవం లభ్యం
ఉరవకొండ, జూన్ 9 : మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న గుట్టల్లో గురువారం గుర్తు తెలియని వృద్ధుని శవాన్ని పోలీసులు కనుగొన్నారు. దాదాపు 65 సంవత్సరాల వృద్ధుడు తెల్లపంచె, తెల్ల షర్టుతో కలిగి ఉన్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన యాచకుడై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
గార్లదినె్న, జూన్ 9 : మండల పరిధిలోని మర్తాడు గ్రామానికి చెందిన తాతయ్య (18) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాతయ్య గేదెలు మేపడానికి పొలాలకు వెళ్లాడు. అయితే ఓ పొలంలో సర్వీస్ వైర్‌ను గేదెలు దాటుతుండగా తప్పించేందుకు వైర్లను పక్కకు వేస్తుండగా ప్రమాదవశాత్తు తాతయ్యకు తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎఇ శివయ్య, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు
గుండెపోటుతో రైతు మృతి
బొమ్మనహాల్, జూన్ 9 : మండలంలోని కిష్ణపురం గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డి (40) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు సంజీవరెడ్డి పొలంలో వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగివచ్చి ఇంటి వద్ద కూర్చున్నాడు. అయితే ఒక్కసారిగా కూలిపోవడంతో చికిత్స నిమిత్తం బళ్లారి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు బళ్లారి నిమ్స్ డాక్టర్లు నిర్ధారించారన్నారు. రైతుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.