అనంతపురం

నైపుణ్య శిక్షణతో బంగారు భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు నైపుణ్యం పెంపొందించుకోకపోవడం ద్వారా బంగారు భవిష్యత్‌కు బాట వేసుకోవచ్చని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక పివికెకె డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణలో భాగంగా పివికెకె ఇంజినీరింగ్ కళాశాలలో ఈఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 15 కంపెనీల ద్వారా 284 మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు చాలామందికి మంచి ర్యాంకులు వచ్చినా సంబంధిత కంపెనీలకు కావాల్సిన సామర్థ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పివికెకెలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ద్వితీయ సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్ (4వ సంవత్సరం) వరకు విద్యార్థులకు నైపుణ్య శిక్షణలో భాగంగా సిఆర్‌టి ద్వారా పర్సనాలిటీ, రీజనింగ్, ఆప్టిట్యూడ్‌లో శిక్షణ ఇస్తున్నామన్నారు. త్వరలో ఎపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సి, సి ప్లస్ ప్లస్, జావా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక శిక్షణ, ఇసిఇ వారికి ఎంబరిడ్ సిస్టం, విఎల్ ఐసి, మెటలాబ్, సివిల్ మెకానికల్ విద్యార్థులకు క్యాడ్, స్ట్యాడ్, ప్రోవ్, సిఎఫ్‌ఒ వంటి శిక్షణ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కనిపించాయన్నారు. పివికెకె ఇంజినీరింగ్ కళాశాలకు మైక్రోసాఫ్ట్ ఐటి సొల్యూషన్స్ వారితో ఎంఒయూ ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రఖ్యాత సంస్థ ఎండి ప్రఖ్యాత, పివికెకె కళాశాలకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.