అనంతపురం

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 9 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టిడిపి నేతల సవాల్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికంగా ఉంటూ ప్రజాసేవకు అంకితమవుతానని చెప్పిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా విచ్చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. రెండేళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వైకాపా ఎండగడితే ఓర్వలేక స్థానిక టిడిపి నాయకులు వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచామని మరోమారు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై టిడిపి నాయకుల విసిరిన సవాల్‌ను వైకాపా స్వాగతిస్తోందన్నారు. మీడియా సమక్షంలో నియోజకవర్గ అభివృద్ధిపై టిడిపి నాయకులు ఏ తేదీని నిర్ణయించినా చర్చకు సిద్ధమన్నారు. వైకాపాతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక వంటి ప్రతినిధులు సైతం హాజరై నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారన్నారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా హాజరైతే మరింత సంతోషిస్తామన్నారు. తాము అడిగే ప్రశ్నలకు కనీసం 50 శాతం జవాబులు ఎమ్మెల్యే స్వయంగా చెబితే అప్పటి నుంచే రాజకీయ సన్యాసాన్ని స్వీకరిస్తానన్నారు. 50 శాతంలోపు బాలకృష్ణ సమాధానాలు చెబితే రాజీనామా చేయిస్తారా అని సవాల్ విసిరారు. రూ.వంద కోట్లతో కూరగాయల మార్కెట్‌ను నిర్మించి వందేళ్లు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రగల్భాలు పలికి వచ్చేనెల 4వ తేదీకి ఏడాది అవుతున్నా కనీసం భూమిపూజ కూడా చేయలేదన్నారు. అంతేగాకుండా పవిత్రమైన రంజాన్ మాసంలో ఉన్నఫళంగా కూరగాయల మార్కెట్‌ను కూలదోసి వ్యాపారులను తీరని అన్యాయానికి గురి చేశారన్నారు. రూ.100 కోట్ల నుంచి రూ.80 కోట్లు, రూ.66 కోట్ల, రూ.34 కోట్లకు కుదించి తాజాగా రూ.8 కోట్లతో కూరగాయల మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ తామేమో గొప్పగా సాధిస్తున్నట్లు బాలకృష్ణ, టిడిపి నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వాసుపత్రికి మంజూరైన నిధులు సైతం గత ప్రభుత్వం విడుదల చేసినవేనన్నారు. నియోజకవర్గంతోపాటు మున్సిపాలిటీలో జరుగుతున్న అరకొర అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఆసీఫుల్లా, షాజియా, అంజినప్ప, రజనీ, నాయకులు మల్లికార్జున, ఫజులూర్ రహిమాన్, ప్రశాంత్‌గౌడ్, సమద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.