అనంతపురం

ఆగస్టు నాటికి హంద్రీనీవా పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 9: మండల పరిధిలో వై.కొత్తపల్లి వద్ద హంద్రీనీవా కాలువపై నిర్మిస్తున్న రెండు బ్రిడ్జిలు రెండవ ప్యాకేజీలో చాలా కీలకమైనవని ఎలాగైనా ఆగస్టు నాటికి పూర్తి చేయించాలనే కృతనిశ్ఛయంతో ఉన్నామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని వై.కొత్తపల్లి సమీపంలో 237 కి.మీ. దూరంలో నున్న రెండవ ప్యాకేజిలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతి ఆలస్యంగా వచ్చిందని అందుకే మార్చి నాటికే పూర్తికావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. జూలై చివరకు వీటి నిర్మాణం పూర్తవుతుందని కాంట్రాక్టర్లు హామీ ఇస్తున్నారని, నేను ప్రతి వారం పనుల పరిశీలన చేస్తానన్నారు. కాగా అవగాహన లేదని బీహార్ నుంచి కూలీలను రప్పించి రాత్రి 10 గంటల వరకు పనులు చేయిస్తున్నామన్నారు. ఇప్పుడు 150 మంది కూలీలు నిరంతరం షిఫ్టు పద్ధతిలో పనులు చేస్తున్నారన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న వంతెన కోసం 18 పిల్లర్లు ఎర్పాటుచేశామని మూడు చోట్ల మట్టి చాలా వదులుగా ఉన్నందున మట్టి పరీక్షలు చేయించి పిల్లర్లు ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. ఇకపోతే కూడేరు మండలం నారాయణపురం వద్ద సత్యసాయి నీటి సరఫరా చేయాల్సిన విద్యుత్ లైన్‌పై ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయి నీటి సరఫరాకు ఆటంకం కలిగిందని సిబ్బంది పేర్కొన్నారు. నాలుగు రోజులుగా నీరు రాక సి.నారాయణపురం నుంచి కనగానపల్లి మండలం నరసంపల్లి వరకు ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.