అనంతపురం

నేరాలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, జూన్ 9 : అనంతపురం, చిత్తూరు జిల్లా పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయని రేంజ్ డిఐజి ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఫ్యాక్షన్ ఉన్న గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఆయా కార్యకలాపాలు పూర్తిగా రూపుమాపినట్లు తెలిపారు. ర్యాగింగ్, నిర్భయ, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పాత కేసులను సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు. మహిళా డిఎస్పీలను ఎక్కువ మందిని నియమించి మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే తరహాలో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంచడంతో సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో గ్యాంబ్లింగ్, మట్కా, కోడి పందేలు వంటి అసాంఘిక చర్యలు జరగకుండా కళ్లెం వేస్తున్నామన్నారు. అంతకుముందు పెనుకొండ డివిజన్ పరిధిలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర సర్కిళ్లలో శాంతిభద్రతలపై సమీక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజలతో మమేకమై పోలీసుల పట్ల ఆప్యాయత, అనురాగాలు పెంపొందేలా మెలగాలన్నారు. ఈ సమావేశంలో ఆయా సర్కిళ్ల సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.