అనంతపురం

నవధాన్య వ్యవసాయానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 9: జిల్లాను కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో నవధాన్య వ్యవసాయాన్ని అమలుచేయడం జరుగుతోందని కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించి నవధాన్య వ్యవసాయ పద్ధతి అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో, పాత పద్ధతులను పునరుద్ధరించడంతలో భాగంగా జిల్లాలో నవధాన్య వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో అమలుచేస్తున్నామని, రాబోవు కాలంలో మరింత పెద్ద ఎత్తున ఈ వ్యవసాయాన్ని అమలుచేసేందుకు ఇప్పటి నుంచే చర్యలను చేపడుతున్నామన్నారు.
ప్రస్తుతం 40 మండలాల్లోని 87 మన విత్తన కేంద్రాల ద్వారా నవధాన్య వ్యవసాయ విధానానికి కావలసిన విత్తనాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఇందులో భాగస్వామిగా ఉందన్నారు. విత్తనాల కిట్ ధర రూ.500 కాగా ఇందులో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందని, మిగిలిన 25 శాతం రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మన విత్తన కేంద్రాలు ద్వారా రైతులకు అవసరమైన నవ ధాన్యాలను అందించాలని కలెక్టర్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గల్లో నవధాన్య వ్యవసాయాన్ని అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జెడి శ్రీరామమూర్తి, డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లుకు సూచించారు. పెసర, సద్ద, జొన్న, అలసంద, కంది, ఆముదాలు, అనప, సీతమ్మజొన్నలే కాకుండా గోంగూర, చౌళీకాయ, బెండకాయ, కాకర, బీర, కొర్ర, సామ, ఆరిక్, నువ్వుల విత్తనాలను మన విత్తన కేంద్రాల ద్వారా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాసన్ ప్రతినిధులు భాగ్యలక్ష్మి, రవీంద్ర, సుధాకర్ హ్యాండ్స్ ప్రతినిధులు నారాయణస్వామి, రెడ్స్ ప్రతినిధి భానుజ, డ్వామా పిడి నాగభూషణం పాల్గొన్నారు.