అనంతపురం

రైతులు నూతన పద్ధతులు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, జూన్ 9: మండల పరిధిలోని రామినేపల్లి గ్రామ రైతుల పొలాల్లో గురువారం మంత్రి పరిటాల సునీత మహిళా రైతులతో కలిసి వేరుశెనగ పొలంలో వేరుశెనగ విత్తనాలు విత్తారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ జిల్లాలో ముందస్తు వర్షాలు కురవడంతో అన్ని పొలాలు సాగు చేసుకున్నారని, అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు బాగా పండాలని రైతులందరూ సుభిక్షంగా వుంటే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అదేవిధంగా అగ్రికల్చరర్ జెడి శ్రీరామమూర్తితో రైతులకు సూచనలు, సలహాలు సూచించారు. విత్తనాల నాణ్యత, విత్తనాలు విత్తుకునేందుకు సరైన సమయం ఇదేనని, తదితర విషయాలపై సూచనలు తెలిపారు. రైతులు ఇంకా పాత పద్ధతులు అవలంబించకుండా నూతన పద్ధతులు ఎంచుకుని మంచి దిగుబడులు సాధించాలని రైతులకు మంత్రి సునీత తెలిపారు. అదేవిధంగా ఏ భూమిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ముందుగానే భూసార పరీక్షలు చేయించుకుని తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా ఆధునిక పద్ధతుల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు వున్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో వుండి రైతులకు సలహాలు, సూచనలు తెలియజేయాలన్నారు. అనంతరం వేరుశెనగ విత్తనాలను పరిశీలించి మహిళా రైతులతో కలిసి ఒడి కట్టుకుని విత్తనాలు విత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దగ్గుబాటి ప్రసాద్, మండల కన్వీనర్ నారాయణస్వామి, ఎంపిడిఓ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి అరుణ్‌కుమార్, మండల టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.