అనంతపురం

మత్స్య సంపద పెంపునకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 9 : వర్షాకాలంలో జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు అన్నారు. గతేడాది ప్రభుత్వ పరంగా 75 లక్షల వివిధ రకాల చేపల్ని ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈఏడాది క్యాప్టివ్ రేరింగ్ పాండ్స్, సొసైటీల ఆధ్వర్యంలో గణనీయంగా చేపల్ని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది 470 లక్షల చేప పిల్లల్ని ఉత్పత్తి చేయగా, ఈఏడాది 900 లక్షల పిల్లల్ని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం జిల్లా మత్స్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అనంతపురంలోని మత్స్య కేంద్రంలో 400, మిడ్ పెన్నార్ డ్యామ్ మత్స్య కేంద్రంలో 500 లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అనంతపురం మత్స్య కేంద్రంలో 550 తల్లి చేపల్ని, ఎంపి ఆర్ కేంద్రంలో 700 తల్లి చేపల్ని వదిలామన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లోపు చేపలు గుడ్లు పెట్టి పిల్లలు తయారు కావాల్సి ఉందని, ఈ సీజన్ దాటితే చేప పిల్లల ఉత్పత్తి ఉండదని తెలిపారు. ప్రభుత్వ పరంగా గతేడాది చేప పిల్లల విక్రయం ద్వారా రూ.3 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కట్ల, రోహు, మృగాల, బంగారు తీగ రకాల చేపల్ని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. 3 నుంచి 10 రోజుల లోపు ఉన్న చేప పిల్లల్ని పాండ్స్‌లో వదులుతామన్నారు. అలాగే సొసైటీలకు అందజేస్తామన్నారు. కాగా గతేడాది ప్రభుత్వం క్యాప్టివ్ రేరింగ్ పాం డ్స్ (సిఆర్‌పి)ను రెండింటిని మంజూ రు చేసినట్లు తెలిపారు. వీటిని గుంతకల్లు మండలంలోని వైటి చెరువు, పికె చెరువులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా పంచాయతీలకు వాటి నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. ఈఏడాది మరో ఐదు సిఆర్‌పిలను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో చేపల పాండ్స్, చెరువులు, సొసైటీలకు (అన్ని రకాల నీటి వనరులకు) కలిపి చేపల పెంపకానికి 6 కోట్ల చేప పిల్లలు అవసరమవుతాయన్నా. కాగా ఒక్కో హెక్టారుకు 20-30 లక్షల చేప పిల్లల్ని పెంచే వీలు ఉంటుందన్నారు. వీటిద్వారా 10 లక్షల చేపలు తయారవుతాయన్నారు. ఈ ఏడాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో ఉపాధి హామీ పథకం కింద ఒక హెక్టారు విస్తీర్ణంలో సిఆర్‌పిలు తవ్వి చేపలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఒక్కో పాండ్‌కు రూ.4.20 లక్షలు ఖర్చు కానుందన్నారు.