అదిలాబాద్

భైంసా డివిజన్‌లో ఊపందుకున్న ఖరీఫ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జూన్ 10: సబ్ డివిజన్ పరిధిలోని భైంసా, కుభీర్, కుంటాల,లోకేశ్వరం, తానూర్, తదితర మండలాల్లో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఖరీఫ్ పనులను వేగవంతం చేశారు. తొలకరి నుండే రైతులకు ఆశించిన మేర వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంట పొలాలకు తరలివెళ్తున్నారు. డివిజన్ పరిధిలో అత్యధికంగా రైతులు పత్తిపంటను సాగుచేస్తుండగా దానికనుగుణంగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలను విత్తడంలో రైతులు తలమునకలయ్యారు. ఎన్నో ఆశలతో ఖరీఫ్ వైపు సాగుతున్న రైతులు ఇప్పటికే పంటలకు సాగయ్యే విత్తనాలను కొనుగోలుచేసుకుని విత్తేందుకు పంటపొలాలకు తరలివెళ్తున్నారు. పత్తి తర్వాత సోయా పంటపై రైతులు ఆసక్తికనబరుస్తుండగా, ఆయా మండల కేంద్రాల్లో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రాయితీపై సోయావిత్తనాలను వ్యవసాయ అధికారులు పంపిణి చేశారు. కోటి ఆశలతో ఖరీఫ్‌కు ముందుకు సాగుతున్న రైతన్నకు వరుణుడు సహకరించాలని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయి.