అదిలాబాద్

మహిళల చైతన్యంతోనే అభివృద్ది సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూన్ 10: గిరిజన గ్రామాల్లో మహిళలను చైతన్యవంతులను చేయూటలో గ్రామైఖ్య సంఘాల పాత్ర చాలా కీలకమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం స్థానిక పిఎమ్మార్సీ భవనంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు అధికారి ఆరుణకుమారితో కలిసి జిల్లా మహిళా సమైఖ్యసంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులను చైతన్యపర్చి ప్రైవేట్ ధళారులు, వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్లకుండా బ్యాంకుల వద్దనే రుణాలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి బీమా యోజన, జీవన్‌జ్యోతి, సురక్షయోజన తదితర ప్రథకాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి వారి కుటుంబ సభ్యులతో ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. ఇవేకాకుండా అవ్వాల్ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టినందునా గర్భిణీలు ఆసుపత్రిలో ప్రసుతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవేకాకుండా వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా పారిశుద్ద లోపాలను సరిచేయడంతో పాటు మహిళలను చైతన్యపర్చాలన్నారు. అనంతరం పలు సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు యశోద, కార్యదర్శి అమ్మాయి, పేదరిక నిర్మూల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధీర్, ఏపివో జనరల్ నాగోరావు, 52 మండలాల మహిళా సభ్యులు పాల్గొన్నారు.