మహబూబ్‌నగర్

ఫిట్‌నెస్ లేని బడి బస్సులను నడిపిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 10: ఫిట్‌నెస్ లేకుండా పాఠశాలలకు సంబంధించి బస్సులను నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ఎంవిఐ నాగరాజు వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, పురపాలిక సంఘంలో మొత్తం 112 స్కూల్ బస్సులు ఉన్నాయని, వాటిలో 60నుండి 70బస్సులు ఫిట్‌నెస్ చేయించుకున్నాయని వివరించారు. జూన్ 13వ తేది వరకు ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే బస్సులకు ఫిట్ చేయడం జరుగుతుందని, పాఠశాలలు ప్రారంభమైన తరువాత ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై స్కూల్ బస్సులు నడిపిస్తే యిజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. స్కూల్ బస్సులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే సహించే ప్రసక్తి లేదని అన్నారు. 15సంవత్సరాల కంటే ఎక్కువగా స్కూల్ బస్సులను నడిపిస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని వివరించారు. ఒక రూట్‌లో బస్సులను నడిపించేందుకు అనుమతులు తీసుకొని మరో రూట్‌లో బస్సులను నడిపిస్తే ఆ పాఠశాల యజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో విద్యాసంస్థల నిర్వహకుల మొబైల్ నంబర్లు, విద్యాసంస్థల ఈ-మెయిల్ ఐడి, వైబ్‌సైట్ అడ్రస్ నమోదు చేసుకోవాలని అన్నారు. అదే విధంగా బస్సు వివరాలు, అటెండర్, డ్రైవర్ వివరాలు, వారి ఫోటోలు సైతం ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. ఏ రూట్‌లో బస్సు ప్రయాణిస్తుంది..ఆ రూట్‌లో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు..వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆర్టీఏ కార్యాలయంలో రుసుం చెల్లించాలని వివరించారు. స్కూల్ బస్సుకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా ఉంటేనే ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ ఇస్తామని, ఇలా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు పాఠశాలల యజమాన్యాలు ముందుకు రావడం లేదని వివరించారు. పాఠశాలల యజమాన్యాలు ముందుకు వస్తే బస్సుల ఫిట్‌నెస్ త్వరగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈనెల 13వ తేదిన రోడ్లపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎంవిఐ నాగరాజు వివరించారు. ఏది ఎమైనప్పటికి ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలు ముందుకు వచ్చి ఫిట్‌నెస్ చేయించుకోవాలని, లేని పక్షంలో సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.