మహబూబ్‌నగర్

ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, జూన్ 10: పాలమూరు ఎత్తిపోతల పథకం కాలువ పనులలో భూములు కోల్పొతున్న కల్వకోలు, చెన్నపురావుపల్లి గ్రామాల రైతులు జీవో 123ను రద్దుచేసి నష్టపరిహారం ఇచ్చినాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు రైతులు చేరుకొని భూములు కోల్పొతున్న రైతులకు ఎలాంటి సమాచారంగాని, నోటీసులుగాని ఇవ్వకుండా పనులు చేస్తున్నారని, ఏ రైతుకు ఎంతమేర నష్టపరిహారం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్‌ఐ బాలరాజుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్ అనే రైతు మాట్లాడుతూ పట్ట్భామిగాని, లావుణి పట్ట్భాములకు నష్టపరిహారం సమానంగా ఇవ్వాలని లేనిచో పనులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్‌ఐ బాలరాజు వారినుద్దేశించి మాట్లాడుతూ రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భూములు కోల్పొతున్న రైతులు రాంబాబు, నిరంజన్, బాలస్వామి తదితరులు ఉన్నారు.