కరీంనగర్

‘మా మండలాలను విలీనం చేయొద్దు..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 10: జిల్లాలో కొనసాగుతున్న చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలను కొత్తగా ఏర్పాటు చేయనున్న సిరిసిల్ల జిల్లాలో కలుపవద్దంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి చొప్పదండి, రామడుగు మండలాలు కరీంనగర్‌లోనే కొనసాగుతాయని, గంగాధరపై కొంత సందిగ్ధం ఉందని, దానిని కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కరీంనగర్‌లో ఉంచేవిధంగా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని హామీ ఇచ్చినట్లు అఖిలపక్షం నేతలు తెలిపారు. కార్యక్రమంలో చొప్పదండి ఎంపిపి గుర్రం భూంరెడ్డి, గంగాధర ఎంపిపి దూలం బాలాగౌడ్, రామడుగు ఎంపిపి మార్కొండ కిష్టారెడ్డి, గంగాధర జడ్పీటిసి ఆకుల శ్రీలత-మధు, ఎంపిటిసిలు ఎలిగేటి తిరుపతి, చీకట్ల రాజశేఖర్, జెఎసి నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు అఖిలపక్షం నేతలు ఆరెల్లి చంద్రశేఖర్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, చేపూరి సత్యనారాయణ పాల్గొన్నారు.