కరీంనగర్

హలాలన్నీ పొలాల వైపే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జూన్ 10: ఖరీఫ్ సీజన్‌కు కర్షకులు శ్రీకారం చుట్టారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 12వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. పైగా రైతులు ప్రతి యేటా 9.5వేల హెక్టార్ల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం కారణంగా అధిక శాతం వర్షాభావ పంటలే సాగు చేస్తున్నారు. వర్షం పడగానే విత్తు నాటేందుకు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పెరిగిన ధరల కారణంగా గత ఏడాది కంటే ఈసారి హెక్టారుకు పాతిక శాతం పెట్టుబడులు అధికం కానున్నాయని రైతులు పేర్కొంటున్నారు. గడిచిన రబీ సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న అన్నదాతలు ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
* అంచనాలు..
ఖరీఫ్ సీజన్‌లో సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల గురించి వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. అన్నీంటిని అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. 9.7వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంటున్నారు. 3 వేల హెక్టార్ల వరి, మొక్కజొన్న 250 హెక్టార్లు, పత్తి 5850 హెక్టార్లు, 300 హెక్టార్లల్లో వాణిజ్య పంటలు సాగవుతాయని అధికారులు తెలిపారు. పత్తి విత్తనాలు 10.8 కిలోలు, 10 ప్యాకెట్ల మొక్కజొన్న, 30 కిలోల వరి, 10 టన్నుల పచ్చిరొట్ట రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్ సీజన్‌కు 1700 టన్నుల యూరియా, 1570 టన్నుల డిఎపి 900 టన్నుల పోటాష్, 460 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
* ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వ్యవసాయాధికారి భూమిరెడ్డి చెప్పారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. విత్తనాలు, ఏరువులు దుకాణాల్లో కొనుగోలు చేసే రైతులు తప్పని సరి బిల్లులు పొందాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు దుకాణదారులు నల్ల దందా సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.