కరీంనగర్

సకాలంలో ఎరువులు, విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 10: జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు అందుబాటులో ఉందని తెలిపారు. బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిధులు, రుణాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తారని, ఈ సంవత్సరం పంట మార్పిడి కింద 93 వేల ఎకరాలలో పప్పుదినుసులను సాగు చేస్తున్నారని చెప్పారు. పత్తి పంటకు బీమా పథకం ఈ నెల 14 చివరి తేదీ ఉందని, దీనిని పొడగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10 నుంచి 20 శాతం వరకు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టామని, పాఠశాలలకు అవసరమైన అన్ని అవసరాలను సమకూర్చాలని ఆదేశాలు ఇస్తామన్నారు. విద్యావలంటీర్ల నియామకం ద్వారా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండేవిధంగా చూడాలన్నారు. ఉపాధ్యాయుల యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, వంద మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో డిప్యూటేషన్ పైన ఉపాధ్యాయులను నియమించాలని తెలిపారు. 300 నుంచి 400 మంది విద్యార్థులు ఉండి శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. 718 పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,368 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం లక్ష్యం కాగా, 754 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని, ఇందుకు రూ.29.7 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈఏడాది దళితులకు వెయ్యి ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహాలో అభివృద్ధిపరుస్తున్నామని, ఇందులో భాగంగా ఆసుపత్రికి అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు అధికారాలను ఇవ్వడం జరిగిందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. సమావేశంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీలు భానుప్రసాద రావు, సుధాకర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్ బాబు, బొడిగె శోభ, గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్, జీవన్‌రెడ్డి, నగర మేయర్ రవీందర్ సింగ్, కలెక్టర్ నీతూప్రసాద్, జెసి పౌసమిబసు, అదనపు జెసి నాగేంద్ర పాల్గొన్నారు.