హైదరాబాద్

తేలని లెక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10 మహానగరంలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు, జంక్షన్ల వద్ధ దర్శనమిస్తున్న బిచ్చగాళ్ల సమస్య జిహెచ్‌ఎంసికే గాక, వివిధ ప్రభుత్వ శాఖలకు సవాలుగా మారింది. వీరిలో ఎక్కువ మంది స్థానికేతరులు ఉండటం, ఎప్పటికపుడు వీరి సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోవటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న అంశంపై వివిధ శాఖల అధికారుల తర్జనభర్జన చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించి నగరాన్ని బెగ్గర్‌లెస్ సిటీగా తీర్చిదిద్దేందుకు గడిచిన పదిహేనళ్లలో వివిధ ప్రభుత్వ శాఖలు సుమారు అరడజను సార్లు అధ్యయనాలు చేసి, క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశాయి. అయినా ఏ ఒక్కటీ ఫలితాలివ్వలేదు. ఇందుకు అధికారులు చిత్తశుద్ధి, పాలకుల అలసత్వం ఓ కారణం కాగా, అసలు ఈ బిచ్చగాళ్లంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? వీరిలో నిజంగానే యాచకృవత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారెంత మంది, వీరిలో స్థానికుల సంఖ్య ఏమిటీ? అన్న అంశంపై నేటికీ ఏ అధ్యయనం కూడా సరైన స్పష్టతనివ్వలేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి నిరుద్యోగులను నగరానికి తరలించి, వారిని బెదిరించి యాచక వృత్తి చేయిస్తున్న ముఠాలు కూడా నగరంలో ఉన్నట్లు ఇటీవల జిహెచ్‌ఎంసి చేసిన సర్వేలో కూడా వెల్లడైంది. వీరికి తగిన శిక్షణిచ్చి, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ధ వీరితో యాచకవృత్తిని చేయిస్తున్న ముఠాలు వందల సంఖ్యలో నగరంలో రిమోట్ కీగా పనిచేస్తున్నట్లు ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి. కనీసం వారిని గుర్తించే దిశగా ఏ ప్రభుత్వ శాఖ కూడా కృషి చేయటం లేదు. కానీ ఇటీవల జిహెచ్‌ఎంసి నిర్వహించిన సర్వేలో నగరంలో మొత్తం 13500 మంది బిచ్చగాళ్లున్నట్లు, వీరిలో కేవలం ఒకే ఒకటి నుంచి రెండు శాతం మంది అడుక్కుంటే గానీ బతికే పరిస్థితి లేదని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 98 శాతం మంది బిచ్చగాళ్లు యాచక వృత్తిని వ్యాపారంగా మల్చుకున్నట్లు కూడా ఈ అధ్యయనంలో తేలినట్లు అధికారులు తెలిపారు. కానీ వీరందరి నెలసరి ఆదాయాన్ని జిహెచ్‌ఎంసి రూ. 24 కోట్ల పై చిలుకుగా ఉన్నట్లు తేల్చింది. వాస్తవానికి కూడా యాచక వృత్తిపైనే పూర్తి స్థాయిలో ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందంటూ, వారికి పునరావాసం కల్పిస్తే, నగరంలో బిచ్చగాళ్ల సమస్య పరిష్కారమవుతుందని జిహెచ్‌ఎంసి అధికారులు భావించటం గమనార్హం. అంతేగాక, జిహెచ్‌ఎంసి ఒక్క విభాగం ఆధ్వర్యంలో ఈ సమస్యకు పరిష్కారం చేకూరదు. కొంత నేరప్రవృత్తి, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌గా కొనసాగుతున్న ఈ బెగ్గింగ్ వెనక ఉన్న మాఫియాను గుర్తించేందుకు పోలసులను సమన్వయం చేసుకుని చర్యలు చేపడితే కొంత మేరకైనా ఫలితాలు వస్తాయన్న వాదనలున్నాయి.
అంతర్‌రాష్ట్ర ముఠాలు
ప్రస్తుతం జిహెచ్‌ఎంసి అధ్యయనంలో తేలిన యాచకుల్లో వాస్తవానికి యాచక వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న పదుల సంఖ్యలో ఉండే బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించి జిహెచ్‌ఎంసి తన పనైపోయిందనుకుని జిహెచ్‌ఎంసి చేతులెత్తేస్తే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తున్న బెగ్గింగ్ మాఫియాను అడ్డుకునేదెవరు? అన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన కొన్ని ముఠాలు నగరంలో చిన్న పిల్లలకు మత్తుమందునిచ్చి, వారు అపస్మారక స్థితికి చేరటంతో వారిని రోడ్లపై పడుకోబెట్టి వసూళ్లు చేస్తున్నారు.
ఇది మరో కోణం
నగరంలో ఒంటరిగా కన్పించే మహిళలను టార్గెట్ చేసి అడుక్కునే వారు కూడా తయారయ్యారు. బస్సు సిగ్నల్ వద్ధ గానీ, స్టాపులో గానీ ఆగినపుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను వెంటపడి డబ్బు యాచిస్తున్నారు. సుమారు 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల ఇలాంటి యువకులు ఒకరు యాచిస్తుండగానే మరో వైపు మరో యాచకుడు వచ్చి మహిళలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇవ్వాలా? వద్దా? ఇవ్వాలనుకుంటే ఎవరికివ్వాలన్నది తేల్చుకోకముందే ఆ ఇద్దరు యాచకులు కలిసి మహిళలను దుర్బాషలాడి డిమాండ్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు కూడా జరిగాయి. ఈ రకమైన వేధింపులకు మహిళలే గాక, పురుషులు కూడా బలైన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మఫ్టీలో విధులు నిర్వర్తించి, వీరిని అదుపులోకి తీసుకుని తగిన కోణంలో విచారిస్తే ఈ బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టయ్యే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.