హైదరాబాద్

నగరంపై సౌదీ మృగాళ్ల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, జూన్ 10: వారంతా ఒకప్పడు బాగా బతికిన వారే..! పేదరికంతో.. పొట్ట చేతపట్ట్టుకుని కుటుంబ పోషణ కోసం పరదేశానికి వెళ్లటమే వారి పాలిట శాపంగా మారింది. ఎన్నో బాధలతో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం కోసం ఆశ్రయిస్తే ఏకంగా సౌదీ అరేబియాకు అమ్మేశారంటూ రాజేంద్రనగర్‌కి చెందిన బాధిత మహిళ ఉస్నాబేగం కన్నీరు పెట్టింది. పాతబస్తీలో ఇలాంటి మహిళలు ఎందరో..! సౌదీలో ఉద్యోగాల కోసం వెళ్లిన మహిళలు షేక్‌ల వేధింపులు తాళలేక తప్పించుకుని, భారత రాయబార కార్యాలయం సహకారంతో స్వదేశానికి చేరుకున్నారు. ఉపాధి పేరుతో నగరానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీ తనను 25వేల రియాల్స్‌కు సౌదీకి అమ్ముకుందని, ఇలాంటి బోగస్ ఏజెన్సీమోసగాళ్లను శిక్షించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితుల్లో ఒకరైన రాజేంద్రనగర్‌కి చెందిన ఉస్నాబేగం మాట్లాడుతూ షేక్‌లు మానసికంగా, శారీరకంగా ఎన్నో వేధింపులకు గురి చేశారని, ఇంటి పనితో పాటు వ్యభిచారం కూడా చేయాలని వేధించేవారని వాపోయంది. ట్రావెల్స్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళల బంధువులు కోరుతున్నారు.