రంగారెడ్డి

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిరువ్యాపారులు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 10: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిరువ్యాపారులు అధికారులకు సహకరించాలని డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌బి, ట్రాఫిక్ పోలీసులతో కలిసి చిరు వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఫుట్‌పాత్ కబ్జాలతో నిత్యం తలెత్తే ట్రాఫిక్ సమస్యతో వచ్చిపోయే వాహనాదారులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో రెడ్, గ్రీన్‌జోన్‌లను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిలో రెడ్‌జోన్, కాలనీల రహదార్లలో గ్రీన్‌జోన్‌లను ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రెడ్‌జోన్‌లలో వ్యాపారం చేయొద్దని, ఇతర ప్రాంతాలలో మాత్రమే నిర్వహించుకోవాలన్నారు. వీధులలో చెత్త, చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవుపలికారు. వ్యాపారులు అధికారులకు సహకరించాలని తెలిపారు. ఏఎంహెచ్‌ఓ కె.స్వామి, ఇఇ నాగేందర్, ఏసిపి నాగిరెడ్డి, టిపిఎస్ సురేందర్‌రెడ్డి, ట్రాఫిక్ సిఐ జంగయ్య, సిఓలు పి.నర్సింగ్‌రావు, గోపాల్ పాల్గొన్నారు.
ఆస్తిపన్ను చెల్లించకపోతే
సీజ్ చేస్తాం
జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో ఉప్పల్ బీరప్పగడ్డ, కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆస్తిపన్ను చెల్లించని వ్యాపార దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. శుక్రవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి దుకాణాలను సందర్శించి నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా చెల్లించాలని ఆదేశించారు.
హౌసింగ్ స్కీంపై
ప్రజల్లో అవగాహన
రామంతాపూర్ డివిజన్‌లో హౌజింగ్ స్కీంపై డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ ప్రజలకు అవగాహన కల్పించారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారిలో ఎవరెవరు అర్హులన్న విషయం విచారణలో తేలిపోతుందన్నారు. కొత్తగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల వివరాలను క్లుప్తంగా వివరించారు. కార్పొరేటర్ గంధం జ్యోత్స్న పాల్గొన్నారు.