రంగారెడ్డి

బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూన్ 10: బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ కె.చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా నాగారం, చీర్యాల గ్రామాల్లో ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విధ్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో డబ్బులు ఖర్చు చేసేదాని కన్నా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మేలని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. చీర్యాల సర్పంచ్ లావణ్యశ్రీనివాస్, ఎం ఇఓ శశిధర్, ఉప సర్పంచ్‌లు బి. శ్రీనివాస్, బి. రమేశ్, ఉపాధ్యాయుడు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
మల్లంపేట్‌లో
జీడిమెట్ల: బడిఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మల్లంపేట్ సర్పంచ్ అర్కల అనంతస్వామి సూచించారు. శుక్రవారం మల్లంపేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పురవీధులలో తిరుగుతూ బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని నినాదాలు చేశారు.
సర్పంచ్ అనంతస్వామి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ పాల్గొన్నారు.