రంగారెడ్డి

ఫసల్ బీమా యోజనతో ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 10: వికారాబాద్ మండలంలోని రైతులు ప్రధానమంత్రి ఫసల్‌భీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వినె్సంట్ వినయ్‌కుమార్ కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ వ్యవసాయ బీమా పథకం, నూతన జాతీయ వ్యవసాయ బీమా పథకం, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న పంటకు హెక్టారుకు 50 వేల రూపాయల బీమాకు అసలు ప్రీమియం 3500 రూపాయలు కాగా రైతుల వాటా 1000 రూపాయలని తెలిపారు. వరికి హెక్టారుకు బీమా 70వేలు కాగా రైతు వాటా రూ.910 అని, జొన్న హెక్టారు బీమా 25 వేల రూపాయలకు అసలు ప్రీమియం రూ.2250 రైతు వాటా రూ.500 అని, కంది హెక్టారు బీమా 32500 రూపాయలకు అసలు ప్రీమియం రూ.3250 కాగా రైతు వాటా రూ.650 అని, పెసర హెకార్టు బీమా 25 వేల రూపాయలకు అసలు ప్రీమియం రూ.2500 కాగా రైతు వాటా రూ.500 అని, మినుము హెక్టారు భీమా 25 వేల రూపాయలు కాగా అసలు ప్రీమియం రూ.1500లు కాగా రైతు వాటా రూ.500 అని, వేరుశనగ హెకార్టుకు 40 వేల రూపాయల బీమా కాగా అసలు ప్రీమియం రూ.2000లు కాగా రైతు వాటా రూ.800 అని, పసుపు హెక్టారుకు లక్షా 37 వేల 500 రూపాయలు బీమాకు అసలు ప్రీమియం రూ.13, 750 కాగా రైతు వాటా రూ.6875 అని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.