అనంతపురం

పరిశ్రమల స్థాపనకు అనుమతులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 10:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను ఆలసత్వం లేకుండా వెంటనే మంజూరు చేయాలని జెసి బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీని కాన్ఫరెన్సు హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ జెసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలను ఫ్రోత్సహించాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్నివసతులను సింగల్ విండో పద్దతిలో మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భణగా 20 పరిశ్రలకు పెట్టుబడి రాయితీను, ఒక పరిశ్రమకు అడ్వాన్స్ ఇన్‌వెస్ట్‌మెంట్ సబ్సిడీని కమిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే 127 పరిశ్రమలకు విద్యుత్తు రీ ఇంబర్స్‌మెంట్, 43 పరిశ్రమలకు పావలా వడ్డీ, 10 పరిశ్రమలకు సేల్స్ టాక్స్ రీయంబర్స్‌మెంట్‌ను, ఒక పరిశ్రమకు స్టాంప్‌డ్యూటీను కమిటీ ఆమోదించింది. ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం సుందరరాజు, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డిపిఓ జగదీశ్వరమ్మ పాల్గొన్నారు.