అనంతపురం

పర్యాటకులను ఆకర్షించేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 10:పర్యాటకులను ఆకర్షించేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ కోనశశిధర్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర శివార్లులోని శిల్పారామాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రస్తుతం జరిగిన పనులను అవసరమైన వసతులను గురించి సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శిల్పారామంలో పచ్చదనాన్ని పెంపొందించాలని టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాల్, ఏఓ శివప్రసాద్‌లను ఆదేశించారు. సందర్శకులను ఆకర్షించేలా ల్యాండ్ నేస్‌లను ఏర్పాటు చేయాలన్నారు. శిల్పారామం గేట్ నుండి హైవే వరకు 20లక్షలతో రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని, త్వరితగతిన రోడ్డు నిర్మించాలన్నారు. సందర్శకులకు ఆకట్టుకునేలా ఒక ఆర్చ్‌ను ఏర్పాటు చేయాలని, అసంపూర్తిగా ఉన్న ప్రహరీని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామీణ వృత్తులకు సంబంధించిన దృశ్యాలు, సంప్రదాయ పరికరాలతో విలేజి మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ ఇడి గోపాల్, ఏఓ శివప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ హరిరాంనాయక్, ఈఈ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.