కడప

బ్యాంక్ రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూన్ 10:పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను సక్రమంగా వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని విప్ మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ సభాభవన్‌లో 154 మంది లబ్దిదారులకు రూ. 1.24 కోట్ల సబ్సిడీ రుణ అర్హత పత్రాలు, చెక్కులను మేడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రూ. 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. లబ్ధిదారులు ఏ యే అవసరాలకైతే రుణాలు తీసుకొంటారో వాటి కోసం వాటిని వినియోగించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కొంతమంది సబ్సిడీ కోసమే రుణాలు తీసుకుని వాటిని ఇతరత్రా అవసరాలకు వినియోగించుకుంటే ఇబ్బందులలో పడే ప్రమాదం ఉందన్నారు. లబ్దిదారులు ప్రభుత్వ ఆశయాన్ని నీరు కార్చకుండా తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు. లబ్ధిదారులు తీసుకున్న రుణాలతో ఏయే యూనిట్‌లు నిర్వహిస్తున్నారో బ్యాంకు అధికారులు గుర్తించాలన్నారు. తీసుకున్న రుణాలతో యూనిట్‌లు నెలకొల్పని వారిపై బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 36 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 29 మందికి రూ. 29 లక్షలు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒకరికి లక్ష రూపాయలు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 50 మందికి రూ. 50 లక్షలు, కాపు కార్పొరేషన్ ద్వారా 39 మందికి రూ. 23.40 లక్షలు రుణాలను పంపి ణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, ఎపిజి బ్యాంక్ మేనేజర్ చంద్రవౌళిరెడ్డి, షేక్ అబు దల్లా, వెంకటసుబ్బయ్య, టి.సంజీవరావు, మల్లెల సుబ్బరాయుడు, జి.గుల్జార్‌బాషా, వడ్డెర రమణ, శ్రీనివాసులు, అబూబకర్, సత్యాల రామకృష్ణ, మందా శ్రీనివాసులు, మెప్మా ప్రతినిధి గోపీనాధ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.