కడప

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జూన్ 10: స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయని, ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ ఛైర్మెన్ ఉండేల గురివిరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ బద్వేలి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధిని, సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలకు ఫలితంగా ఆసుపత్రికి ఎ-గ్రేడ్ వచ్చిందన్నారు. వైద్యుల కృషి, సహకారంతో ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన సేవలందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆసుపత్రిని దత్తత తీసుకున్న ఎంపి రమేష్‌నాయుడు ఆసుపత్రికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని, అలాగే ప్రస్తుత ఎంపి ల్యాడ్స్ కింద రూ.9.90 లక్షలతో ఆసుపత్రి చుట్టూ రోడ్ల అభివృద్ధి ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన సిటీ స్కాన్ యంత్రం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని అలాగే ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య కూడా పెరిగిందన్నారు. మున్సిపల్ ఛైర్మెన్ వుండేల గురివిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ తరుపున ఆసుపత్రికి తాము చేయగలిగిన సాయం చేస్తామన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సి-గ్రేడ్‌లో వున్న ఆసుపత్రి ప్రస్తుతం ఎ-గ్రేడ్‌కు రావడం వెనుక వైద్యుల కృషి, తోడ్పాటు ఎంతో వుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, వైద్యులు బుసిరెడ్డి, డేవిడ్‌రాజ్, శివరామ్, టిడిపి కౌన్సిలర్లు మార్కాపురం గణేష్‌బాబు, తలారి పుల్లయ్య, మార్తల రామమునిరెడ్డి, నూరి, పట్టణ టిడిపి అధికారప్రతినిధి వీరశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.