కడప

వాడివేడిగా జడ్పీ సమావేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 10: నగరంలోని జిల్లా పరిషత్ సభాభవన్‌లో శుక్రవారం జరిగిన 7వ జెడ్పి సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. వైకాపా, తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపై పరస్పరం ధూషణల మధ్య సమావేశం జరిగింది. సమాశానికి అధ్యక్షత వహించిన వైకాపా నేత జెడ్పి చైర్మన్ గూడూరు రవి కూడా గతంలో ఎన్నడూ నోరువిప్పని ఆయన శుక్రవారం జరిగిన సమావేశంలో తన స్వరాన్ని పెంచారు. వేదికపై జెడ్పి చైర్మన్, కన్వీనర్‌గా కలెక్టర్ కెవి సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, శాసన మండలిడిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వవిప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డిలు ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో కడప, రాజంపేట ఎంపిలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.మిథున్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కె.శ్రీనివాసులు, వైకాపా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డిలు హాజరై ప్రసంగిస్తూ జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచ్‌ల వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని వారు ధ్వజ అధికారపార్టీ నేతలపై ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా అధికసంఖ్యలో సర్పంచ్‌లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పిటిసిలు, వైకాపా నేతలు కావడంతో స్థానిక సంస్థల్లో ప్రజలచే ఎన్నుకోబడి తమ పార్టీ నేతల అధికారులకు బేడీలు వేశారని, వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా నీరు-చెట్టు కార్యక్రమంలో కోట్లాదిరూపాయలు అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, పచ్చచొక్కాలకే పదవులని , పేరుకేమో అభివృద్ధి సంక్షేమం పేరిట గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని అవినీతి అక్రమాలకే నిలయమని వారు ధ్వజమెత్తారు. వెంటనే సతీష్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలు ఏ పథకంలో చోటుచేసుకున్నా సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన సభాముఖంగా నొక్కినొక్కి స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి కూడా స్వరం పెంచి వైకాపా ప్రజాప్రతినిధులపై విరుచుకుపడ్డారు. దీంతో జెడ్పి చైర్మన్ గూడూరు రవి సభలో ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలుగానీ , జెడ్పిటిసిలు కానీ తన అనుమతి లేకుండా మైకులు తీసుకుని ప్రసంగించడం ఏమిటని నేతలను ప్రశ్నించారు. దీన్ని గమనించిన వైసిపి ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అధికారపార్టీ నాయకులు సభా విలువలకు గౌరవించడం లేదని జిల్లాలో ప్రథమ పౌరుడైన జెడ్పి చైర్మన్ గూడూరురవి మాటాలను దిక్కరించడంపై తాను సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నానని నిరసన వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వెళ్లారు. అవినీతిపై త్వరలో కమిటీని వేసి విచారణ చేపడతామని ముఖ్యంగా నీరు-చెట్టు కార్యక్రమం, లక్కిరెడ్డిపల్లెలో రోడ్లనిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని కలెక్టర్ కెవి సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వెంకటప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 2010 నుంచి 2015 వరకు రైతులకు రావాల్సిన పంటనష్టం, ఇన్సురెన్స్‌ను అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లాలో రూ.73వేల కోట్లు పంటనష్టం జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ హార్టికల్చర్‌లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఇన్సురెన్స్‌ను వర్తింపచేస్తే అరటిరైతులకు ఇన్సురెన్స్‌ను అందించడంలో ప్రభుత్వం సఫలీకృతవౌతుందని దీని వల్ల రైతులు నష్టపోయిన నష్టపరిహారాన్ని ఇన్సురెన్స్ రూపంలో పొందవచ్చునన్నారు. ఇప్పటి వరకు జిల్లాను యూనిట్‌గా తీసుకోవడం వల్ల హార్టికల్చర్‌లో అరటి రైతులు ఇన్సురెన్స్ పొందక పంటనష్ట పోయి అప్పుల పాలౌతున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చెంగల్రాయులు, దేవగుడి నారాయణరెడ్డి, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.