కడప

పంట సంజీవిని లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జూన్ 10:రాజంపేట నియోజకవర్గానికి కేటాయించిన 15 వేల పంట సంజీవిని, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పూర్తి చేసి లక్ష్యాలను అధిగమించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుస్తామని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతలకుంట గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకం పనుల్లో మేడా స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు భూగర్భజలాల పెంపునకు చేపట్టిన ఇంకుడుగుంతలు, పంట సంజీవిని త్రవ్వకాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. ఏ గ్రామంలో కూడా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకుడుగుంతలు, పంట సంజీవిని పనుల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. కడపలో జరిగిన నవ నిర్మాణ మహా సంకల్ప యాత్రలో సిఎం వనభారతి, పంట హరతి పథకంలో భాగంగా పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ప్రాంతంలోనైతే చెట్టు సంవృద్దిగా ఉంటాయో ఆ ప్రాంతంలో కాలుష్యం హరించి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. త్వరలో ఈ పథకాలను ప్రవేశ పెట్టనున్నారని, ఇందుకు లక్ష మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్నారు. గతంలో కంటే నేడు పింఛన్‌ల పెంపు, రేషన్, పక్కాగృహాలకు రూ. 2.75 లక్షలు, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీలు చేసిందన్నారు. ఇంటింటా ఇంకుడుగుంతలు నిర్మించుకుని భూగర్భజలాల పెంపునకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేడా పద్మజ, సింగల్‌విండో అధ్యక్షులు మేడా విజయభాస్కర్‌రెడ్డి, స్పెషలాఫీసర్ శ్రీనివాసులు, ఎపిఓ భార్గవి, ఈఓఆర్డీ ప్రసాద్, వెలుగు ఎపిఎం సంజీవరాజు, డాక్టర్ షామీరాభాను, విద్యుత్ ఏఇ జయరామయ్య, మండల అధికారులు దినేష్, రామకృష్ణమరాజు, నీటి సంఘం అధ్యక్షులు దుంతల నరసారెడ్డి, శంకరరెడ్డి, ఎస్సై భక్తవత్సలం, టిడిపి నాయకులు సుబ్బారెడ్డి, రామ్మోహనరెడ్డి, అన్నం నాగేంద్ర, ఓ.శ్రీనివాసులు పాల్గొన్నారు.