కడప

నంద్యాల - ఎర్రగుంట్ల మధ్య త్వరలో రైళ్ల రాకపోకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జూన్ 10:సెప్టెంబర్‌లో నూతనంగా నంద్యాల - ఎర్రగుంట్ల రైలుమార్గంలో నూతనంగా రైళ్ల రాకపోకలు సాగించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు బూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను మాడల్ రైల్వేస్టేషన్‌గా తీర్చేందుకు రైల్వే శాఖ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ఈ నెల 7న గుంతకల్‌లో జరిగిన డిఆర్‌యుసిసి సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ అభివృద్ధిపై చర్చించారన్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్‌యుబిల నిర్మాణంకు అధికారులు హామీ ఇచ్చారన్నారు. నందలూరు రైల్వేకేంద్రంలో చిల్డ్రన్స్ పార్క్, పుట్‌వేర్ బ్రిడ్జిని రన్నింగ్ రూం వరకు విస్తరిస్తారన్నారు. 3వ ప్లాట్‌ఫారంలో ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు, కడప రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు రైల్వే అధికారులు ఆమోదించారన్నారు.