చిత్తూరు

న్యూట్రిన్ కార్మికులకు రాజంపేట ఎంపి ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 10: చిత్తూరు నగరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తనవంతు సాయం అందజేశారు. లాకౌట్‌లో ఉన్న ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలంటూ గత 185 రోజులుగా కర్మాగారం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న కార్మికులను ఆర్థికంగా ఆదుకునే చర్యల్లో భాగంగా రెండు రోజుల క్రితం రూ 2.75 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయాన్ని వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పివి గాయత్రీదేవి మంగళవారం కార్మికుల దీక్షా స్థలానికి చేరుకుని కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాక్టరిని తిరిగి తెరిపించి తమకు న్యాయం చేయాలంటూ కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (జెసిఎల్) ఇచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రభుత్వరంగ సంస్థలను మూయించివేసిందని, తన సంస్థలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రైవేటురంగ సంస్థలను సైతం మూయిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.