తూర్పుగోదావరి

రూ.7లక్షల విలువైన గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జూన్ 10: ఏజెన్సీ నుండి తమిళనాడుకు తరలిస్తున్న రూ.7లక్షల విలువైన ఎండు గంజాయిని శుక్రవారం జడ్డంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మారుమూల గ్రామాల్లో పండిస్తున్న గంజాయిని నలుగురు వ్యక్తులు కొనుగోలుచేసి అటవీ మార్గం గుండా జడ్డంగి సమీపంలోని అరటి తోటలో రహస్యంగా దాచారు. గంజాయిని అక్కడి నుండి తరలించేందుకు రహదారిపై అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నాలుగు బస్తాల్లో దాచి ఉంచిన 140 కిలోల గంజాయి బయటపడింది. తమిళనాడు మధురైకి చెందిన ఆండీ, పాండ్యన్, రమేష్‌తోపాటు విశాఖ ఏజెన్సీకి చెందిన జర్తా సన్యాసిరావును పోలీసులు అరెస్టు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ బాపూజీ, విఆర్వో సూరమ్మ పంచనామా నిర్వహించారు. ఇన్‌ఛార్జి సిఐ ముక్తేశ్వరావు, జడ్డంగి ఎస్సై నాగార్జున, ఎఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరుస్తామని సిఐ వెల్లడించారు.