గుంటూరు

సంగీత ప్రపంచాన మేరునగధీరుడు ఎస్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 10: సంగీత ప్రపంచంలో మేరుగనధీరుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అని రచయిత్రి ఎవికె సుజాత కొనియాడారు. అవగాహన సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం సంస్థ కార్యాలయంలో సినీ గాయకుడు ఎస్‌పి జన్మదినం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. నెలనెలా నిర్వహించే మనమూపాడుదాం రండి కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రచయిత్రి ఎవికె సుజాత మాట్లాడుతూ ఎస్‌పి బాలు అనే పదం వింటేనే లక్షలాది మంది సినీ అభిమానుల్లో సంగీతస్ఫూర్తి రగులుతుందన్నారు. విశ్రాంత ఇంజనీర్ ఘనశ్యామాచార్యులు మాట్లాడుతూ నిత్యనూతనంగా పాడటం ఒక్క ఎస్‌పికే సాధ్యమన్నారు. విద్యావేత్త ఇ చంద్రయ్య మాట్లాడుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ సశాస్ర్తియమైన సంగీతాన్ని వీనులవిందుగా స్వరాభిషేకం చేసిన ఘనత బాలుకే దక్కిందన్నారు. ఆయన స్వరాన్ని, గళాన్ని అనుకరించిన వారెందరో నేడు కళాకారులుగా రాణిస్తున్నారన్నారు. అనంతరం నేనొక ప్రేమ పిపాసిని అన్న పాటతో ప్రారంభమైన కార్యక్రమం పల్లవించవా నా గొంతుకలో అనే పాటతో ముగిసింది. ఈ కార్యక్రమంలో గోవిందమ్మ, అనురాధ, రాజ్యలక్ష్మి, మొగిలి ప్రసాద్, రాజశేఖర్, హనుమాయమ్మ, రత్నాజీ, రమణమూర్తి, సీతారాం, భవశ్రీ తదితరులు గేయాలను ఆలపించారు.