గుంటూరు

చట్టాలపై అవగాహనతో బాధ్యతగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుండూరు, జూన్ 10: అందరూ చట్టపరిధిలో చట్టాలపై అవగాహనతో బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యం గా రైతులు వ్యవసాయ సంబంధమైన విత్తనాలు ఇతర రకాలు కొనుగోలు చేసేసమయంలో బిల్లులు తప్పక తీసుకోవాలని ఆలా తీసుకున్నప్పుడే నష్టపోయిన రైతులు న్యాయ పరిధిలో కో ర్టు ద్వారా తగిన నష్టపరిహారం పొందవచ్చునని తెనాలి 1వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి ప్రభాకరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మండలలోని ఒలివేరులో జరిగిని న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ కుటుంబంలో అందరూ బాధ్యతగా నిర్వహించుటకు బాల్యంనుండే తగిన జాగ్రత్తలు తీసుకొని సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలుగని రీతిలో ప్రవర్తించాలన్నారు. పోలీసులు, అధికారులు ఇతర పెద్దమనుష్యుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, కుటుంబసమస్యలు అన్నీ బయటకు చెప్పుకునే పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. చుండూరు సిఐ సుభాషిణి అధ్యక్షులుగా వ్యవహరించి మా ట్లాడుతూ మహిళలు చట్టాలను గౌరవించుకోవాలని, దుర్వినియోగ పరచరాదని అసాంఘిక కార్యక్రమాల పట్ల అవగాహనతో సంబంధిత అధికారుల కు తెలియపరచాలని, జూదం, మద్యం అలవాట్లకు బానిసలు కాకుండా మహిళలే ఎక్కువ బాధ్యత తీసుకోవాలన్నారు. కుటుంబంలో యువతీ, యువకులను సమానమైన గౌరవ భావాలతో బాల్యంనుండే చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళల నుండే ప్రారంభం కావాలని తెలిపారు. ఈకార్యక్రమంలో 2వ అనదపు సెషన్స్ న్యాయమూర్తి సిహెచ్ పవన్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు దీనదయాళ్, ఇజ్రాయేల్, సుధాకర్, చుండూరు తహశీల్దార్ యడ్వర్డ్, సర్పంచ్ గాదె శివరామకృష్ణారెడ్డి, ఎంపిటిసి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామస్థులు అడిగిన న్యాయ సంబంధమైన ప్రశ్నలకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సూచనలు, సలహాలు ఇచ్చారు.