గుంటూరు

ఆశ్రయ వార్డులో సరైనోడు విజయోత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూన్ 10: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ 50 రోజుల విజయోత్సవ వేడుకలను చిరంజీవి, అల్లు అర్జున్ అభిమానులు శుక్రవారం స్థానిక ప్రభుత్వా ఆసుపత్రి ఆవరణలోని ఆశ్రయ వార్డులోని మానసిక వికలాంగుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా భారీ కేక్‌ను కట్‌చేసి వికలాంగులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ సరైనోడు చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులుగా తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శత విజయోత్సవం జరుపుకునేందుకు సంసిద్ధవౌతున్నట్లు చెప్పారు. పెసర్లవ్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి యువత తెనాలి పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె దావూద్, జిల్లా అల్లుఅర్జున్ యువత అధ్యక్షులు తన్నీరు కిషోర్, ఎస్‌కె రఫీ, కె మణి, హర్షవర్ధన్, కె వంశీ, మహేష్, కేసినేని, రేవంత్‌కుమార్, వినయ్ పాల్గొన్నారు.