ఖమ్మం

కోదండరాంపై టిఆర్‌ఎస్ విమర్శలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 10: తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాంపై టిఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు సరికాదని, కేంద్ర, రాష్ట్రాలు రెండేళ్ల పాలనలో చేసింది శూన్యమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు అన్నారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సద్భావనయాత్రలో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో విహెచ్ మాట్లాడుతూ వేలాది మంది ప్రాణత్యాగంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించడంలో విఫలమైందన్నారు. కెసిఆర్ నియంతలా వ్యహరిస్తున్నారని, రాష్ట్భ్రావృద్ధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొపెసర్ కొదండరాంపై టిఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడటం హేయమైన చర్య అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించి వలసవాదులను పెంచిపోషిస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ అభద్రతాభావంతోనే ఇతర పార్టీల వారని చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు వారి వ్యాపారాలను కాపాడుకునేందుకే టిఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడి ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరైంది కాదన్నారు. దేశంలో బిజెపి మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ప్రజల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని, దీనిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ నేతలు ప్రలోభాల పర్వాన్ని వీడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఒక పార్టీతో గెలిచిన వారిని ఇంకొక పార్టీలో చేర్చుకోకవడం నైతికత కాదనే విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అహ్మద్, వనమా వెంకటేశ్వర్లు, కొల్లు కిషన్, వడ్డెబోయిన నర్సిహరావు, బాలగంగాధర్‌తిలక్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, బండి మణి, పసుపులేటి లక్ష్మి పాల్గొన్నారు.