ఖమ్మం

కూరగాయల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, జూన్ 10 : సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు కూరగాయల ధరలు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే వీటి ధరలు 50శాతం పెరగడంతో సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు వేసవి ఎండల తీవ్రత కూరగాయల సాగుపై పడటంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో మార్కెట్‌కు సరిపడా కూరగాయలు రాకపోవడంతో దాని ప్రభావం ధరలపై పడింది. వారం రోజుల్లో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు నిత్యవసర వస్తువులు ధరలు కూడా అధికంగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం తీవ్రంగా పడుతోంది. పప్పుడు తిందామన్నా వాటి ధరలు కూడా కేజి రూ.200లకు చేరడంతో మధ్యతరగతి ప్రజలు వాటివైపు చూసే పరిస్థితి లేదు. చికెన్ కేజి. రూ. 180లు, మటన్ కేజి. 500లకు చేరడంతో ఏమి తినాలో తెలియని పరిస్థితి నెలకొంది.
50శాతం అధికం
సాధారణంగా నిన్నటి వరకు ఉన్న వేసవి దృష్ట్యా దిగుబడి తగ్గిపోవడంతో కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి. దీనితో వారం క్రితం కిలో టమాట రూ.40లు ఉండగా నేడు రూ.120, కిలో వంకాయలు రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.80, పచ్చిమిర్చి కిలోరూ.20 కాగా ప్రస్తుతం రూ.140లకు చేరుకుంది. బెండకాయ రూ. 20 నుంచి 65, బీరకాయ రూ.30 నుంచి రూ. 100, క్యారెట్, కొత్తిమీర, ఆకుకూరల ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.