శ్రీకాకుళం

ఎసిబి వలలో అవినీతి చేప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూన్ 10: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న గండుబిల్లి రవి శుక్రవారం మధ్యాహ్నం ఎసిబి వలలో చిక్కుకున్నారు. స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద ఎసిబి దాడిలో 50వేలు లంచం తీసుకుంటు దొరికిపోయారు. ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు అందించిన వివరాల ప్రకారం అనకాపల్లికి చెందిన దాడి శ్రీనివాసరావు అనే పైపులైన్ కాంట్రాక్టర్ సుమారు రూ.35లక్షలతో పైపులైన్ పనులు చేస్తుండగా రూ.10లక్షల స్పాట్‌పేమెంట్ బిల్లుకు ఎఇ రవి రూ.50వేలు డిమాండ్ చేసినట్టు రంగరాజు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిని లంచం అందిస్తుండగా పట్టుకొని అదుపులోనికి తీసుకున్నట్టు ఎఎస్పీ రంగరాజు తెలిపారు. గతంలో విశాఖపట్నంలో కార్పొరేషన్‌లో పనిచేసిన ఎఇ రవి అతని అక్రమ ఆస్తులను అంచనా వేస్తూ విశాఖపట్నంలో ఉన్న పలు ఆస్తులపై దాడులు జరుపుతున్నట్టు రంగరాజు తెలిపారు. ఈ దాడుల్లో సిఐ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.