శ్రీకాకుళం

ఫిట్‌‘లెస్’పై కొరడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఆమదాలవలస రైల్వే ట్రాక్‌పై 2015 ఆగస్టులో ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్ నిలిచిపోయింది. గేట్లు లేని ఆ ట్రాక్‌పై ఇలా వ్యాన్ మొరాయించడంతో బడిపిల్లల ప్రాణాలు గాలిలో ఊగిసిలాడాయి. ఆ సమయానికి రైళ్ళు రాకపోకలు లేకపోవడంతో పిల్లలను దింపించేసి, వ్యాన్‌ను పట్టాల పైనుంచి తప్పించారు.
* టెక్కలి-సోంపేట జాతీయ రహదారిపై డిసెంబర్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నుజ్జునుజ్జయింది. ఒక చిన్నారి మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాలలకు చెందిన బస్సులు సభలకు, ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదని నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఇంజన్లు మరమ్మతులకు గురై ఆకస్మాత్తుగా పై సంఘటనలు చోటుచేసుకుం టున్నాయి.
* తాజాగా శ్రీకాకుళం నగరంలో కొత్త బ్రిడ్జిపై ఓ ప్రైవేటు పాఠశాల ఆటో విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో విద్యార్ధులంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. మితిమీరిన పిల్లలను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇలా ... ఎక్కడో ఒకచోట తరచూ పాఠశాలల బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ప్రమాదాల బారిన పడుతునే ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలతో పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనే కల నెరవేరకపోగా తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం బడి, కళాశాల బస్సుల ప్రమాదాలను నివారించేలా నిబంధనలు ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో కఠినతరం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాల పనితీరు, సామర్థ్యాన్ని, నిబంధనల అమలుతీరును గుర్తించే పనిలో పడ్డారు. బస్సుల సామర్థ్య నిర్థారణ విషయంలో నిబంధనలు మేరకు అన్నీ సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు కొన్ని విద్యా సంఘాలు చేసిన ఫిర్యాదుల మేరకు విజయవాడ నుంచి ఉన్నతాధికారులు పరిశీలన నిమిత్తం రెండు రోజులుగా బడి బస్సులపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. బడి సమయంలో కాకుండా రోడ్డులపై తిరిగే స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. అలాగే, సభలు, ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్ళే బడిబస్సులను కూడా రవాణాశాఖ సరికొత్త నిబంధనలతో సీజ్ చేస్తోంది.
ఇదిలా ఉండగా, జిల్లాలో వివిధ విద్యాసంస్థలకు మొత్తం 1864 బస్సులున్నాయి. ఈ నెల 15వ తేదీలోగా జిల్లాలో అన్ని పాఠశాల, కళాశాలలు బస్సులు సామర్థ్యం పరీక్షలలో అర్హతపొందాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ కేవలం పదుల సంఖ్యలో మాత్రమే అర్హత పత్రాలు పొందాయి. ఈ ఏడాది అధికారులు నిబంధనలు కఠినతరం చేసిన వాటిని కచ్చితంగా అమలు చేస్తుండటంతో ఫిట్‌నెస్ పరీక్షలకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు. దీంతో గడువు ముగిసే సమయానికి అన్ని బస్సుల పరిశీలన పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ఆర్టీఏ అధికారులు హైరానా పడాల్సివస్తోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు చివరిరోజు వరకు ఆగి ఆ తర్వాత పైపైన పరీక్షలతో ధ్రువపత్రాలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
బడి బస్సు సామర్థ్య పరీక్ష చేయించాలంటే ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎపిట్రాన్స్‌పోర్టు.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో చలానా, బస్సు వివరాలు పొందుపరచాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బస్సును తనిఖీకి ఏ సమయంలో తీసుకెళ్లాలో వివరాలు వస్తాయి. ఆ మేరకు సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళి సామర్థ్య పరీక్ష పూర్తి చేయించుకోవాల్సివుంటుంది. గతంలో ఎలా ఉన్న ఈసారి మాత్రం నిబంధనలు కఠినతరం చేయడంతో గడువు ముగిసేనాటికి బడి బస్సులన్నింటికీ సామర్థ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలంటూ ఆర్టీఏ అధికారి చెప్పారు. ఇప్పటి వరకూ 62 బస్సులకు మాత్రమే అర్హత పత్రాలు పొందాయని, నిబంధనలు పాటించకపోయినా, సకాలంలో ధ్రువీకరణ పత్రం పొందకపోయినా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శ్రీదేవి ‘ఆంధ్రభూమి’కి చెప్పారు.
నిబంధనలు ఇవే...
* బడి బస్సు వయస్సు 15 ఏళ్ళులోపు ఉండాలి. కచ్చితంగా బీమా కలిగి ఉండాలి. వాహనం ముందు వెనుక పాఠశాల బస్సు అని, సంస్థపేరు రాయించాలి. దాని పక్కనే పిల్లల చిత్రాలు ఉండాలి.
* సీట్లు సౌకర్యవంతంగా ఉండాలి. బస్సు వెనుక వైపు అత్యవసర ద్వారం తప్పనిసరి. పిల్లు ఎక్కడానికి వీలుగా ఫుట్‌బోర్డు మొదటిమెట్టు నేల నుంచి 325 మి.మీ. లోపు ఎత్తు ఉండాలి.
* అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స పెట్టే, అవసరమైన మందులు ఉంచాలి. బస్సులు ముందు భాగంలో తెలుపు, వెనుక ఎరుపు, పక్కనే పసుపు రంగు రేడియం స్టిక్కర్లు అమర్చాలి.
* బ్రేక్, హారన్, ఇంజన్ కండిషన్ సక్రమంగా ఉండేలా చూడాలి. డ్రైవర్ ఫోటో, లైసెన్స్ వివరాలను అందరికీ తెలిసేలా బస్సులోపల బోర్డు ఏర్పాటు చేయాలి. నిత్య ప్రయాణించే పిల్ల జాబితాను బస్సులో ఉంచాలి.
* విద్యార్థులను ఎక్కించేందుకు దించేందుకు ప్రతీ బస్సుకు ఒక అటెండర్‌ను ఏర్పాటు చేయాలి. రోజూ రాకపోకలు రూట్‌మ్యాప్ బస్సులో అతికించాలి. పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలి.
* యాజమాన్యం, పిల్ల తల్లిదండ్రులు కలిసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతీ నెలా బస్సు స్థితిని పరీక్షించాలి. ప్రతీరోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలి. ఉపాధ్యాయుల నుంచి ఒకరు, పిల్లల తల్లిదండ్రుల నుంచి మరోకరు బస్సులో ప్రయాణించాలి. సమస్యలుంటే నేరుగా రవాణాశాఖ అధికారులకు కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయాలి.