శ్రీకాకుళం

వెబ్ కౌనె్సలింగ్‌లో దరఖాస్తుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జూన్ 10: మండల కేంద్రంలో గల అంపోలు పేరున ఉన్న జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో శుక్రవారం వెబ్‌కౌనె్సలింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు నిర్వహించారు. స్థానిక విద్యాలయం ప్రిన్సిపాల్ గణపతిరావు పర్యవేక్షణలో టెక్కలి, ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గురుకుల విద్యాలయాల సిబ్బంది ఈ వెబ్‌కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించారు.
5వ తరగతి ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఈ దరఖాస్తుల ప్రక్రియలో సుమారు వంద మంది విద్యార్థులు హాజరైనట్టు అంపోలు విద్యాలయం ప్రిన్సిపాల్ గణపతిరావు తెలిపారు. అంపోలు విద్యాలయానికి 80 సీట్లు, టెక్కలికి 80సీట్లు, అమలాపురం మత్స్యకారుల విద్యాలయానికి 20సీట్లు చొప్పున మంజూరైయ్యాయని ఇందుకు కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహింపజేసినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ప్రక్రియను సి.ఆదినారాయణరావు, పి.వి.వి. క్రిష్ణమూర్తినాయుడు, రామ్‌ప్రసాద్, ధనుంజయరావు, విద్యాధరరావు, రాయితన్న, బాబూరావు తదితరులు నిర్వహింపజేశారన్నారు.