శ్రీకాకుళం

అఫీషియల్ కాలనీలో స్వచ్ఛ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, జూన్ 10: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు స్పందించిన అఫీషియ్ కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగత పరిశ్రభతతోపాటు పరిసరాల శుభ్రత చేపట్టి ఆరోగ్యకర వాతావరణానికి నాంది పలికాలని ఇచ్చిన పిలుపుతో కాలనీ వాసులు స్ఫూర్తి పొందారు. కాలనీ వాసుల స్ఫూర్తికి నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి దవళ భాస్కరరావు అండగా నిలిచి నగర పాలక సంస్థ తరుపున అండగా నిలిచి పరిశుభ్రతకు ముందుకు వచ్చే వారికి తమ సహకారం ఉంటుందని చెప్పారు. అఫీషియల్ కాలనీలోగల ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి అపార్టుమెంటు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోటగిరి శ్రీరామచంద్రమూర్తి, ట్రెజరరల్ చిట్టిబాబు అపార్టుమెంటు వాసులు, కాలనీ వాసులు హెచ్.కృష్ణారావు, డిల్లేశ్వరరావు, సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోగల పిచ్చిమొక్కలు, చెత్తను తొలిగించారు. గొడలకు పెయింటింగ్ చేయించారు. పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ నినాదాలను రాయించి పలువురు స్ఫూర్తి పొందేందుకు నిర్ణయించారు. ఈ స్ఫూర్తి మరింత ఉద్ధృతం కావడానికి తమ తోడ్పాటును అందిస్తామని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి భాస్కరరావు తెలిపారు. పట్టణంలోని కాలనీ వాసులు, అపార్టు వాసులు ఈ విధంగా ముందుకు రావాలీని ఆయన కోరారు.