విజయవాడ

బిసి సంచార జాతులకు ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 10: రాష్ట్రంలో సంచార జాతుల సంక్షేమానికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం తెలిపారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సంచార జాతుల సమీక్షా సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం 139 బిసి కులాలు ఉన్నాయన్నారు. వాటిలో ఉన్న 32 సంచార జాతులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ మేరకు వెనుకబడిన వర్గాలకు చెందిన సంచార జాతులకు ఎంబిసి కార్పొరేషన్ పేరుతో ఏర్పాటు చేశామన్నారు. దీనికి త్వరలోనే నిధులు కేటాయిస్తామని ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి జివో నెం.17 విడుదల చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిసిల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తున్నారని, ఈ ఏడాది రూ.300 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. బిసి కార్పొరేషన్‌తో పాటు సబ్ ప్లాన్ కూడా పనిచేస్తుందన్నారు. బిసి సంక్షేమశాఖలో అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని జగన్ అనునిత్యం కుట్ర పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సివిల్స్ పరీక్షల శిక్షణకు
ఎంట్రన్స్ పరీక్షల నోటిఫికేషన్
బిసి, కాపు అభ్యర్థులు ఉచితంగా సివిల్స్ పరీక్షల శిక్షణకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీనికి సంబంధించి శనివారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జూన్ 26న పరీక్ష ఉంటుందని, 28న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. జెఎన్‌టియు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని, రాష్ట్రంలో 7 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. 500 మంది బిసి విద్యార్థులు, 500 మంది కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించినవారికి సివిల్స్ ఎంట్రన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి తెలిపారు.