విజయవాడ

నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 10: తమ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొండా ఉమకు సిగ్గుంటే తక్షణమే కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజకు క్షమాపణలు చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు వంగవీటి రాధకృష్ణ డిమండ్ చేశారు. 59వ డివిజన్ కండ్రికలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ ఇళ్ల విషయమై 59వ డివిజన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ ఎమ్మెల్యేను ప్రశ్నించగా ఆమెను ఏకవచనంతో సంభోదించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తగదన్నారు. జన్మభూమి గ్రామ సభలో ఇళ్ల కోసం 2వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 450 మందిని అర్హులుగా ఏలా తెలుస్తారని ప్రశ్నించారు. అర్హుల జాబితాను అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..? కార్పొరేటర్‌కు తన డివిజన్‌లో జరిగే విషయాల గురించి తెలుసుకునే హక్కు ఉండదా..? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సైతం తాము గెలిస్తే కో-ఆపరేటివ్ బ్యాంక్ రుణాల్ని రద్దు చేస్తామని చెప్పిన నేతలు ఈ డివిజన్ ప్రజల్ని నిలువెత్తున మోసం చేశారని విమర్శించారు. తాము అధికారంలో లేని డివిజన్లలో అభివృద్ధి జరగకుండా తెలుగుదేశం నేతలు అవరోధం కలిగిస్తూ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ తన డివిజన్‌లో మొత్తం 2వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 450 మందిని అర్హులుగా తేల్చి, తనకు తెలియకుండా సర్వే చేశారని, అర్హుల జాబితాను ఇవ్వమని ఎమ్మెల్యేను కోరితే ‘సొల్లు చెప్పొద్దు..లిస్టు ఇస్తే నువ్వు సర్వే చేస్తావా...?’ అంటూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ ఇస్తున్నారని ఆరోపించారు.