విజయనగరం

‘మీతో-మీ ఎస్పీ’కి ఫిర్యాదుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 10: జిల్లా ఎస్పీ లేళ్ల కాళిదాసు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న మీతో-మీ ఎస్పీ ఫోన్ ద్వారా ఫిర్యాదుల కార్యక్రమానికి పలు ఫిర్యాదులు అందాయి. చీపురుపల్లి పట్టణానికి చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి అందించిన ఫిర్యాదులో కొంతమంది వ్యక్తులు అక్రిడేషన్ గుర్తింపుకార్డులు లేకుండా విలేఖర్లుగా చలామణి అవుతూ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలలో బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎస్పీ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా అందిన వినతులపై ఆయా పోలీసుస్టేషన్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేసారు.