విజయనగరం

కోనాడ రైతులకు లీజుపట్టా భూమిపై హక్కులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 10: గడచిన 30 ఏళ్లుగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామంలో సర్వే నెం.24లో సుమారు 12 ఎకరాల 90సెంట్లభూమిని లీజు పట్టాలుగా పొందిన రైతులకు ప్రభుత్వం భూమి హక్కు పత్రాలు కల్పించాలని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బాధిత రైతులు కోలగట్లను కలసి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కొంత మంది ఈభూమిని జిరాయితీగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 1985లో 43 మందిరైతులకు అప్పటి ప్రభుత్వం సర్వే నెం. 24లో 57లో 11-51సెంట్లు, 59లో 1.39 సెంట్లు భూమిని లీజు పట్టాలుగా మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికీ ఆ భూములు ఎఫ్‌సిలో ప్రభుత్వ భూమిగా రికార్డు అయిందని చెప్పారు. అయితే 2004లో కొంతమంది బాపన్న శాస్ర్తీ పేరిట జిరాయితీగా మార్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్టవేసి కోనాడ రైతులకు న్యాయం చేసేందుకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు పి. సాంబశివరాజు, కోనాడ ఎంపిటిసి లక్ష్మణరెడ్డి,మాజీ సర్పంచ్ గోవిందరావు పాల్గొన్నారు.