విజయనగరం

నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూన్ 10: నిరుపేదలకు శుభవార్త.. వారు నివశించడానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 2 లక్షలకుపై రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలు జూలై నెలాఖరు నాటికి విడుదల చేస్తామని రాష్ట్ర గ్రామీణ, గృహ నిర్మాణశాఖా మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు. పురపాలకసంఘ కార్యాలయంలో చైర్‌పర్సన్ ఛాంబర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ 1250 ఇళ్ల వంతున రెండు గదుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు జూలై నెలాఖరునాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నిరుపేదలు అందరికి పూర్తిస్థాయిలో గృహాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వ కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టుతెలిపారు. అలాగే లింటల్, రూఫ్ లెవిల్‌వరకు నిర్మించిన ఇళ్లకు 324 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించినట్టు పేర్కొన్నారు. 2004 ముందు నిర్మించిన ఇళ్ల మరమ్మతుల నిమిత్తం ఒక్కొక్క ఇంటికి 10 వేల రూపాయలు మంజూరు చేసేందుకు ప్రతిపాదించామని, ఇందుకు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ నిర్మాణశాఖలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నీరు-చెట్టు కార్యక్రమానికి రాష్ట్రంలో 2వేల 140 పనులు గుర్తించామని, వీటిలో 400 పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా నిర్వహించేందుకు ప్రభుత్వం 130 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా పూర్తిగా మొక్కలు నాటేందుకు కోటి 50 లక్షల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. ఒకే గ్రామంలో 2 వేల మొక్కలు నాటితే ఆ గ్రామ అభివృద్ధికి 2 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. ఒకే గ్రామంలో 150 నుంచి 200 ఇంకుడు గుంతలు నిర్మిస్తే అటువంటి గ్రామాలకు 2 లక్షల రూపాయల వంతున ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈమెతోపాటు పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు, వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు పాల్గొన్నారు.