పశ్చిమగోదావరి

భీమోలులో మళ్లీ భూ వివాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, జూన్ 10: మండలంలోని భీమోలు గ్రామంలో భూములకు సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదాలు మళ్లీ తలెత్తాయి. ఈ గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు ఉండడంతో ఆ భూముల్లో గత కొనే్నళ్లుగా గ్రామంలోని కొందరు సాగుచేసుకుంటున్నారు. ఈ భూముల వ్యవహారం న్యాయ స్థానంలో ఉండగా ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఈ భూములు ఉన్నాయి. ఆ భూములు సాగువిషయమై ఏటా గ్రామంలోని ఇరువర్గాల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి శాంతింపజేయడం పరిపాటిగా మారింది. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా ఇరువర్గాలు కోట్లాటకు దిగి స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకునే స్థాయికి పరిస్థితి చేరుకుంది. ఒక వర్గానికి చెందినవారు తమపై దాడి జరిగిందని కావాలనే తమపై ఘర్షణకు దిగుతున్నారంటూ స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద కొందరు ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్పందించి భూముల సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.