పశ్చిమగోదావరి

కాపునేతల హౌస్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 10: జిల్లాలోని కాపునాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గత 24 గంటల నుండి వీరు పోలీసుల అధీనంలోనే ఉన్నారు. శనివారం బంద్ కారణంగా ముందస్తుగానే పోలీసులు ఈ చర్యలకు పూనుకున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తుని ఘటన నేపథ్యంలో అమాయకులను సిఐడి పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దీక్షతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో కాపుగర్జనకు జిల్లా నుండి ఎవరెవరు వెళ్ళారు అనే వివరాలు తెలుసుకున్న పోలీసులు వారి ఇళ్ళను రక్కీ చేశారు. జిల్లా అంతా కూడా ఒకే సమయంలో ఈ రెక్కీ నిర్వహించారు. దీంతో పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ముద్రగడ అరెస్టును ముందే తెలుసుకున్న పోలీస్ అధికార యంత్రాంగం కాపు ఉద్యమకారులపై నిఘా ఉంచాయి. పోలీస్ ఉన్నతాధికారులు ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు ఆయా స్టేషన్స్ పరిధిలో ఉన్న కాపుసంఘాల నాయకులు, అధ్యక్ష,కార్యదర్శులతో వారి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. మారువేషాల్లో పోలీసులు కాపుసంఘాల నాయకులను కలుసుకుని వారి వివరాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వారి ఫొటోలను కూడా సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవలే నియమింపబడిన కాపునాడు అధ్యక్ష,కార్యదర్శులను హౌస్ అరెస్టు చేశారు. ఇక జిల్లాలోని కాపుసామాజికవర్గం ఉన్న నియోజకవర్గంగా భీమవరం పేరొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ కాపునాడు జిల్లా అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడుని రాయలంలోని ఆయన స్వగృహంలో టూటౌన్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే కాపు ఉద్యమానికి సంబంధించి అనుబంధంగా ఉన్న సంఘాల నాయకులను కూడా హౌస్ అరెస్ట్‌లు చేశారు. పోలీసులు ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని, చంద్రబాబునాయుడుకు ఇది తగదని వెంకట్రాయుడు విరుచుకుపడ్డారు.