రాశిఫలం 12-06-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ అష్టమి రా.తె.4.14
నక్షత్రం: 
పుబ్బ మ.1.58
వర్జ్యం: 
రా.9.44 నుండి 11.27 వరకు
దుర్ముహూర్తం: 
సా.04.24 నుండి 05.12
రాహు కాలం: 
సా.4.30 నుండి 6.00
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ధనలాభముంటుంది. నూతనన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడుదురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆర్థిక చింత యుండదు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందెదరు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. నూతన కార్యాలు ప్రారంభించకుండా నుండుట మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం వుంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృధాప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలధిగమించుటకు ఔషధ సేవ తప్పదు. అన్నింటా సహనం వహించక తప్పదు.
Date: 
Sunday, June 12, 2016
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి