క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు వికాస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 11: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రియో ఒలింపిక్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసు కున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వ ర్యంలో జరిగిన ప్రో బాక్సింగ్ ఫైట్‌లో అతను కె న్యాకు చెందిన నిక్సన్ అబాబాను 3-0 తేడాతో ఓ డించాడు. ఈ ఫైట్‌లో పాల్గొనడం ద్వారా అతను వచ్చేనెల వెనెజులాతో జరిగిన ఒలింపిక్స్ చివరి క్వాలిఫయర్‌లో పోటీ పడేందుకు అర్హత సంపా దించాడు. కాగా, ఈనెల 16 నుంచి అజర్‌బైజా న్‌లో జరిగే క్వాలిఫయర్‌కు ఆదివారం రాత్రి బయ లుదేరనున్న వికాస్ శనివారం కీలక విజయాన్ని సాధించడం విశేషం. ఈ విజయంతో అతను ఒ లిపిక్స్‌లో పాల్గొనే అర్హతను దాదాపుగా సంపాదిం చుకున్నాడు. భారత బాక్సింగ్ సమాఖ్య అతని అ భ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇలా వుంటే, క్వాలిఫయర్స్‌లో పాల్గొని విజయాలను సా ధించిన వారికి ఒలింపిక్స్‌కు నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. వికాస్ ఆ ప్రయత్నాన్ని కూడా కొనసా గించనున్నాడు. అజర్‌బైజాన్‌లో జరిగే క్వాలిఫయ ర్స్‌లో గెలిస్తే అతను మరో టోర్నీకి హాజరుకావా ల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అక్కడ అనుకు న్న స్థాయలో రాణించలేకపోతే, అతనికి వెనెజులా లో చివరి క్వాలిఫయర్స్ ఈవెంట్ రూపంలో మరో అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ప్రో బాక్సిం గ్ ఈవెంట్‌ను గెలిచిన అతను ఒలింపిక్స్‌లో పాల్గొ నే అవకాశాన్ని సంపాదించడం ఖాయం.