క్రీడాభూమి

‘చాంపియన్స్’లో భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టో ర్నీలో భాగంగా జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌ని డ్రా చేసుకున్న భారత జట్టు శనివారం నాటి రెండో మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 2-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ 17వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ చేసిన గో ల్‌తో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన భారత్‌కు 34వ నిమిషంలో హర్‌మన్‌ప్రీత్ సింగ్ రెండో గోల్ సా ధించిపెట్టాడు. దీనితో ఎదురుదాడికి దిగిన బ్రిటన్ 35వ నిమిషంలో ఆష్లే జాక్సన్ ద్వారా గోల్‌ను సం పాదించింది. ఆతర్వాత వ్యూహత్మకంగా ఆడిన భా రత్ ప్రత్యర్థిని నిలువరించి గెలిచింది. కాగా, బ్రిటన్ తన మొదటి మ్యాచ్‌ని ఆస్ట్రేలియాతో డ్రా చేసుకుం ది. ఇరు జట్లు మితిమీరిన డిఫెన్స్‌తో ప్రేక్షకులకు విసుగుతెప్పించాయి. గోల్స్ చేయడం కంటే, ప్రత్యర్థి జట్టును గోల్స్ చేయకుండా అడ్డుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టాయి. చివరికి ఒక్క గోల్ కూడా నమోదు కాకుండానే మ్యాచ్ డ్రాగా ముగిసింది.
సమవుజ్జీలు బెల్జియం, జర్మనీ
చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం, జర్మనీ జట్లు సమవుజ్జీలుగా నిలిచాయ. ఇరు జట్లు చెరి నాలుగు గోల్స్ సాధించాయ. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్ మూడో నిమిషంలోనే జర్మనీ ఆటగాడు టోబిస్ హకెట్ గోల్ చేయగా, 17వ నిమిషంలో సెబాస్టియన్ డొకెర్ బెల్జియంకు ఈక్వెలైజర్‌ను అందించాడు. 24వ నిమిషంలో జర్మనీకి మార్కో మిట్కార్, మరో ఆరు నిమిషాల్లోనే బెల్జియంకు ఆర్థర్ వాన్‌డోరెన్ గోల్స్ సాధించిపెట్టారు. ఆతర్వాత బెల్జియం 39వ నిమిషంలో అలెగ్జాండర్ డి పాను, 41వ నిమిషంలో ఫ్లోరియంట్ వాన్ అబెల్ గోల్స్ చేయడంతో బెల్జియం ఆధిక్యం ఒక్కసారిగా 4-2కు దూసుకెళ్లింది. అయతే, ఏమాత్రం వెనుకంజ వేయని జర్మనీ ఎదురుదాడికి దిగింది. 51వ నిమిషంలో మార్కో మిట్కార్ మరో గోల్‌తో జట్టును ఆదుకున్నాడు. మరో మూడు నిమిషాల్లోనే ఆలివర్ కాన్ చేసిన గోల్‌తో బెల్జియంతో జర్మనీ స్కోరు సమమైంది. అనంతరం గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
బెల్జియంకు కొరియా షాక్
హాట్ ఫెవరిట్‌గా బరిలోకి దిగిన బెల్జియం జట్టుకు దక్షిణ కొరియా షాకిచ్చింది. 2-0 తేడా విజయాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ 26వ నిమిషంలో యాంగ్ జిహున్ తొలి గోల్ చేయగా, 43వ నిమిషంలో జంగ్ మనే్జ మరో గోల్ సాధించాడు. ఆతర్వాత కొరియా వ్యూహాత్మకంగా ఆడుతూ, గోల్స్ కోసం బెల్జియం చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకొని విజయ భేరి మోగించింది.